Andhra Pradesh: టీడీపీ, బీజేపీ మధ్య పవన్ బ్రోకర్ లా తయారయ్యారు: సి.రామచంద్రయ్య విమర్శలు

  • తాజా పరిణామాలపై స్పందించిన వైసీపీ నేత
  • చాడీలు చెప్పేందుకు పవన్ ఢిల్లీ పర్యటన  
  • పవన్ పెయిడ్ ఆర్టిస్టు అంటూ వ్యాఖ్యలు

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వైసీపీ నేత సి.రామచంద్రయ్య స్పందించారు. పవన్ కల్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్టు అని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ మధ్య పవన్ బ్రోకర్ లా తయారయ్యారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై చాడీలు చెప్పడానికే పవన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

పవన్ చెప్పిన విషయాలు విన్న జేపీ నడ్డా అన్నీ తమకు తెలుసని చెప్పారని అన్నారు. అప్పట్లో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని కేంద్రంపై ధ్వజమెత్తిన పవన్ ఇప్పుడెందుకు బీజేపీ పెద్దలను కలుస్తున్నారో చెప్పాలని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తూ రాజధాని రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని పవన్ పై మండిపడ్డారు.

Andhra Pradesh
Amaravati
YSRCP
C.Ramachandraiah
Chandrababu
Pawan Kalyan
BJP
Telugudesam
Jana Sena
  • Loading...

More Telugu News