Darbar: విడుదలైన నాలుగు రోజుల్లోనే టీవీలో దర్బార్.. నిర్మాత ఆగ్రహం

  • రజనీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్
  • మొదట వాట్సాప్ లో లీకైన చిత్రం
  • తాజాగా శరణ్య టీవీ చానల్ లో ప్రసారం

పైరసీ దెబ్బ తగిలితే ఎంత పెద్ద నిర్మాతైనా విలవిల్లాడాల్సిందే. అందుకే తమ చిత్రం పైరసీ బారిన పడకూడదని ప్రతి నిర్మాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఏదో ఒక రూపేణా చిత్రం లీకవడం ఇటీవల కాలంలో తరచుగా దర్శనమిస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం సైతం అందుకు మినహాయింపు కాదు.

ఈ సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే ఓ లోకల్ టీవీ చానల్లో ప్రసారమైంది. అసలు మొదటే ఈ సినిమా వాట్సాప్ లో లీకైంది. అది కూడా హెచ్ డీ నాణ్యతతో! ఇంతలో శరణ్య టీవీ చానల్ దర్బార్ ను ప్రసారం చేసి నిర్మాతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధురైకి చెందిన ఈ చానల్ పై దర్బార్ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా శరణ్య టీవీ చానల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేసింది.

Darbar
Rajinikanth
Kollywood
Tamilnadu
Madurai
Saranya Tv Channel
  • Loading...

More Telugu News