Pawan Kalyan: రేపు కాకినాడ వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్

  • కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ దాడి
  • గాయాలపాలైన జనసైనికులు
  • పరామర్శించనున్న పవన్ కల్యాణ్

కాకినాడలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య వాడీవేడి వాతావరణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తల దాడిలో జనసైనికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు కాకినాడ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ ఆపై కాకినాడ పయనం అవుతారు. తొలుత, ఆదివారం నాటి ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు. చివరగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన స్పందన తెలియజేయనున్నారు. ప్రస్తుతం పవన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Jana Sena
Kakinada
YSRCP
New Delhi
Vizag
  • Loading...

More Telugu News