Kento Momota: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వరల్డ్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్

  • మలేసియా మాస్టర్స్ టైటిల్ నెగ్గిన జపాన్ క్రీడాకారుడు కెంటో మొమోటా
  • కౌలాలంపూర్ లో ఎయిర్ పోర్టుకు వెళుతుండగా ప్రమాదం
  • లారీని ఢీకొట్టిన మొమోటా ప్రయాణిస్తున్న వ్యాన్.. డ్రైవర్ మృతి 

మలేషియాలో జరిగిన మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన జపాన్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ కెంటో మొమోటా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కౌలాలంపూర్ నుంచి తన స్వదేశం జపాన్ వెళ్లేందుకుకు మొమోటా ఎయిర్ పోర్టుకు పయనమయ్యాడు. అయితే అతడు ప్రయాణిస్తున్న వ్యాన్ ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొమోటాకు ముక్కు పగిలింది. ముఖంపై పలు చోట్ల గాయాలయ్యాయి.  

విషాదం ఏంటంటే, మొమోటా ప్రయాణిస్తున్న వ్యాన్ డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించాడు. మొమోటా అసిస్టెంట్ కోచ్ కు, ఫిజియోథెరపిస్ట్ కు, బ్యాడ్మింటన్ సంఘం అధికారికి గాయాలు తగిలాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కెంటో మొమోటా, అతడి టీమ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మొమోటా ఆరోగ్య స్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News