Bhaimsa: భైంసాలో క్రమంగా సాధారణ పరిస్థితులు!

  • భైంసాలో నిన్న రెండు వర్గాల మధ్య ఘర్షణలు
  • పలువురికి గాయాలు
  • 144 సెక్షన్ విధింపు

తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో నిన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడం తెలిసిందే. ఈ గొడవల్లో కొంతమందికి గాయాలయ్యాయి. దాంతో భైంసాలో 144 సెక్షన్ విధించడమే కాకుండా, సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. భైంసాలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఘర్షణలు వ్యాప్తి చెందకుండా పోలీసులు తీసుకున్న చర్యలు ఫలితాలనిచ్చాయి.

Bhaimsa
Telangana
Police
144 Section
Nirmal District
  • Loading...

More Telugu News