Amaravati: 'సేవ్ అమరావతి' పేరుతో టీడీపీ నాయకుల 'గులాబీల' నిరసన

  • చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద వినూత్న ప్రచారం 
  • వాహన చోదకులకు పూలందించి మద్దతు కోరిన వైనం 
  • టీఎన్ఎస్ఎఫ్ బ్రహ్మం ఆధ్వర్యంలో కార్యక్రమం

రాజధాని అమరావతిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఉదయం వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పార్టీ నేత టీఎన్ఎస్ఎఫ్ బ్రహ్మం ఆధ్వర్యంలో వాహన చోదకులకు గులాబీ పూలు అందించి మద్దతు అర్థించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి పలువురు ఆంధ్రాకు తరలివస్తున్నారు. వీరందరికీ గులాబీలు అందజేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ నిరసనకు మంచి స్పందన కనిపించింది.

Amaravati
Krishna District
tollplaza
  • Loading...

More Telugu News