Vikram: 'కోబ్రా'గా 25 గెటప్స్ లో కనిపించనున్న విక్రమ్!

  • విక్రమ్ తదుపరి చిత్రంగా 'కోబ్రా'
  • దర్శకుడిగా అజయ్ జ్ఞానముత్తు 
  • ప్రస్తుతం కోల్ కతాలో షూటింగ్  

విక్రమ్ అంటేనే విభిన్నమైన పాత్రలు .. విలక్షణమైన గెటప్పులు. తన పాత్రలు ప్రయోగాత్మకంగా .. ప్రయోజనాత్మకంగా ఉండాలని ఆయన భావిస్తాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా ఆ తరహాలోవే. కొన్ని రోజులుగా ఆయన మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్' షూటింగులో పాల్గొంటూ వచ్చాడు. థాయ్ లాండ్ లో ఆ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి కాగానే ఈ సినిమా టీమ్ అంతా చెన్నై వచ్చేశారు.

కానీ విక్రమ్ మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. 'కోబ్రా' సినిమా కోసం వెంటనే ఆయన కోల్ కతా వెళ్లాడు. ఆయన కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ 25 గెటప్స్ లో కనిపిస్తాడట. ఒక గెటప్ కి మరో గెటప్ కి మధ్య ఎలాంటి పోలిక లేకుండా చకచకా గెటప్స్ మార్చేస్తూ ఉంటాడని అంటున్నారు. ఈ అంశమే ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News