Kurnool District: అమ్మో పులి... శ్రీశైలం ఘాట్ రోడ్డులో భయం భయం!

  • రోడ్డుపై అడ్డంగా నిల్చుని హల్ చల్ 
  • వాహనాల్లో వచ్చిన భక్తుల్లో భయాందోళనలు   
  • దాదాపు 20 నిమిషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే

శ్రీశైలం ఘాట్ రోడ్డులో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. రోడ్డు మధ్యన తిష్టవేసిన పులి దాదాపు 20 నిమిషాలపాటు భక్తులకు చెమటలు పట్టించింది. ఈ ఘటనలో ఘాట్ లో ప్రయాణిస్తున్న వారు వణికిపోతున్నారు. శ్రీశైలం దేవస్థానానికి పది కిలోమీటర్ల దూరంలో ఆంజనేయస్వామి గుడి ఉంది. ఈ గుడికి సమీపంలోని చిన్నారుట్ల వద్ద భక్తులకు పులి తారసపడింది. 

రోడ్డుకు అడ్డంగా ఇది నిలబడడంతో అటూ ఇటూ వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వెంటనే భక్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి దాదాపు ఇరవై నిమిషాలపాటు కదలకుండా ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పులి వెళ్లిపోయిన తర్వాత వాహనాలు ముందుకు కదిలాయి. కానీ ఈ ఘటన భక్తుల్లో భయాందోళనలు రేపుతోంది.

Kurnool District
srisailam
ghat road
Tiger
  • Loading...

More Telugu News