Hyderabad: కారు డోర్లను లాక్ చేసి.. ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం!

  • శంషాబాద్‌లో ఘటన
  • క్యాబ్ ఎక్కిన ఉద్యోగినిపై అసభ్య ప్రవర్తన
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు

ఓ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. శంషాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ ఎయిర్‌లైన్ సంస్థలో పనిచేస్తున్న శంషాబాద్‌కు చెందిన యువతి (20) విధులకు వెళ్లేందుకు నిన్న జాతీయ రహదారిపై అంబేద్కర్ క్రాస్‌రోడ్డు వద్ద  బస్సు కోసం ఎదురుచూస్తోంది.

ఈ క్రమంలో ఓ క్యాబ్ ఎక్కిన ఆమెతో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె సెల్‌ఫోన్ లాక్కుని, కారు డోర్లను లాక్ చేసి అత్యాచారానికి యత్నించాడు. అదే సమయంలో అటువైపు కొందరు రావడంతో ఆమెను అక్కడే వదిలేసి కారులో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
shamshabad
cab driver
  • Loading...

More Telugu News