India: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు 200 ఫైటర్ జెట్స్!

  • పెరగనున్న వాయుసేన బలం
  • 83 తేజస్ విమానాల కాంట్రాక్ట్ తుది దశలో
  • ఏడాదికి 16 విమానాలు

భారత వాయుసేన బలం మరింతగా పెరగనుంది. ఎయిర్ ఫోర్స్ విభాగానికి 200 వరకూ ఫైటర్ జెట్స్ రానున్నాయని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. వీటిల్లో దేశ, విదేశీ తయారీ యుద్ధ విమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. హెచ్‌ఏఎల్‌ (హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌) తయారుచేసే 83 లైట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్సీఏ) తేజస్‌ మార్క్‌ 1ఏ విమానాల కాంట్రాక్టు తుది దశలో ఉందని తెలిపారు. ఈ విమానాల డిజైన్ పూర్తి అయిందని, ఏడాదికి 16 విమానాలు తయారీ అవుతాయని ఆయన తెలిపారు.

India
Air Force
Fighter Jets
  • Loading...

More Telugu News