Kolkata: తన శరీరానికి బాంబులు ఉన్నాయన్న యువతి... విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలెట్లు

  • కోల్ కతా నుంచి ముంబయి వెళుతున్న విమానం
  • పేపర్ పై రాసి కెప్టెన్ కు ఇవ్వాలని కోరిన పాతికేళ్ల యువతి
  • కోల్ కతాలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • యువతిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు

ఎయిర్ ఏషియా విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఓ ప్రయాణికురాలు తాను ఆత్మాహుతి బాంబర్ నంటూ అందరినీ హడలగొట్టింది. కోల్ కతా నుంచి ముంబయి వెళుతున్న విమానంలో  మోహిన మోండాల్ అనే పాతికేళ్ల యువతి తన శరీరానికి బాంబులు అమర్చుకున్నానని తెలపడంతో ఆ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. కోల్ కతా నుంచి బయల్దేరిన కాసేపటికే ఆ యువతి ఓ పేపర్ పై రాసి దాన్ని ఫ్లయిట్ కెప్టెన్ కు ఇవ్వాలని ఎయిర్ హోస్టెస్ ను కోరింది.

తాను ఒంటిపై ఉన్న బాంబులు ఏ క్షణంలో అయినా పేలతాయని ఆమె ఆ కాగితంపై రాసింది. దాంతో హడలిపోయిన పైలెట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి కోల్ కతా ఎయిర్ పోర్టులో అత్యవసరంగా కిందికి దించారు. మోహినీ మోండాల్ ను సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. వారు ఆమెను విమానాశ్రయంలో దూరంగా తీసుకెళ్లి తనఖీలు చేపట్టారు. ఘటనపై ఆమెను ప్రశ్నిస్తున్నారు.

Kolkata
Mumbai
Air Asia
Plane
Suicide Bomber
CISF
  • Loading...

More Telugu News