Jagan: ఆమెను బూటు కాలితో తన్నించారు: ఫొటో పోస్ట్ చేసిన నారా లోకేశ్
- విడిచి పెట్టడానికి కులం అడిగారు
- మహిళల పై పోలీసుల ముసుగులో అరాచకాలు
- 144 సెక్షన్ పెట్టి మహిళల్ని ఇళ్లలో బందిస్తారా?
అమరావతి ఆందోళనల్లో పోలీసుల దాడిలో గాయపడిన శ్రీలక్ష్మి అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను పోలీసులు బూటు కాలితో తన్నిన ఫొటోను పోస్ట్ చేశారు.
'పోలీసు బూటు కాలుతో తన్నించారు, విడిచి పెట్టడానికి కులం అడిగారు. మహిళల పై పోలీసుల ముసుగులో జరిగిన అరాచకాలు అన్నీ కమిషన్ దృష్టికి తీసుకువెళతాం. మహిళల పట్ల ఇంత దారుణంగా, అసభ్యంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి జగన్ గారు ఒక్కరే' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
'జాతీయ మహిళా కమిషన్ సభ్యులు రాష్ట్ర పర్యటనకి వస్తే జగన్ గారు ఎందుకు భయపడుతున్నారు? మహిళలు నోరు విప్పితే వైకాపా ప్రభుత్వం చేసిన నీచమైన పనులు ప్రపంచానికి తెలుస్తాయని భయమా? 144 సెక్షన్ పెట్టి మహిళల్ని ఇళ్లలో బందిస్తారా? పోలీసుల ముసుగులో మహిళల పై జరిగిన దాడిని దాచేస్తే దాగదు' అని లోకేశ్ మరో ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు.