Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు ఇంకా అపాయింట్ మెంట్ ఇవ్వని అమిత్ షా... వేచి చూస్తున్న జనసేనాని!

  • నిన్న ఢిల్లీకి చేరుకున్న పవన్
  • ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల బిజీ
  • మధ్యాహ్నం తరువాత షా అపాయింట్ మెంట్!

నిన్న జనసేన సమావేశాన్ని మధ్యలోనే వదిలేసి హడావుడిగా న్యూఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇంకా ఏ బీజేపీ నేతనూ కలవలేదు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను పవన్ కలుస్తారని ప్రచారం జరుగగా, ఇంకా ఎవరి అపాయింట్ మెంటూ ఖరారు కాలేదు. దీంతో ఆయన న్యూఢిల్లీలోనే వేచి చూస్తున్న పరిస్థితి.

కాగా, మధ్యాహ్నం తరువాత అమిత్ షా అపాయింట్ మెంట్ లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. న్యూఢిల్లీ ఎన్నికల ప్రచారం విషయమై పార్టీ అగ్రనేతలు బిజీగా ఉండటమే ఇందుకు కారణమని జనసేన నాయకులు అంటున్నారు.

Pawan Kalyan
Amit Shah
JP Nadda
Appointment
Jana Sena
New Delhi
  • Loading...

More Telugu News