: ఫిక్సర్లను పెళ్ళాడబోమంటున్న వధువులు


ఇద్దరు ఆటగాళ్ళను పరిణయమాడాలనుకుంటున్న వధువులు ఇప్పుడు విముఖత వ్యక్తం చేస్తున్నారట. ఇంకేం చేస్తారు, కాబోయే పతిదేవుళ్ళు ఇంత గ్రంథసాంగులని తెలిశాక! డబ్బు కోసమే కాక అతివల పొందు కోసం క్రికెట్ లో అవినీతికి పాల్పడి కెరీర్ కే మాయని మచ్చ తెచ్చుకున్నవాళ్ళు, రేపు, కాపురం సక్రమంగా చేస్తారన్న గ్యారంటీ ఏంటని వారు సందేహిస్తున్నారట. గతంలో ఓసారి ఇలాగే దుందుడుకుతనం, వివాదాలకు సై అనే మనస్తత్వంతో ఓ పెళ్ళి సంబంధాన్ని దూరం చేసుకున్న కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్.. తాజా ఫిక్సింగ్ తో మళ్ళీ అలాంటి గోతిలోనే పడ్డాడు.

మనోడి 'స్పాట్' టాలెంట్ ధాటికి మరో సంబంధమూ వెనక్కివెళ్ళింది. అయ్యగారి ఫిక్సింగ్ లీలలు కళ్ళారా చూసి కళ్ళు బైర్లుకమ్మి వద్దుబాబోయ్ అని వియ్యానికి సెలవన్నారట. ఇక చండీలా విషయానికొస్తే ఇతగాడికి వచ్చేనెల 2న వివాహం జరగాల్సి ఉంది. వధువు చిరకాల స్నేహితురాలు. ఎంతటి ప్రియనేస్తమైతే మాత్రం కోరి అవినీతిని కొంగున కట్టుకుంటుందా. ఇంకేమీ ఆలోచించకుండా 'పెళ్ళి వాయిదా' అంటూ ప్రకటించేసింది. ఈ కేసులో నుంచి వీరు బయటపడేదెప్పుడో.. వీరికి పెళ్ళయ్యేదెప్పుడో.. కాలమే తేల్చాలి!.

  • Loading...

More Telugu News