Supreme Court: మీడియా చర్చించవచ్చు...నిర్ధారణ చేయకూడదు: సుప్రీంకోర్టు

  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ను సవాల్ చేస్తూ పిటిషన్
  • ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన నోటీసుల ప్రస్తావన 
  • దీనిపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం వ్యాఖ్య

తీవ్రమైన సంఘటనలు జరిగినప్పుడు వాటిని ప్రసారం చేయడం, వాటిపై వ్యాఖ్యానాలు, మాట్లాడే స్వేచ్ఛ మీడియాకు ఉంటుందని, అదే సమయంలో సదరు వ్యక్తిది తప్పు లేదా ఒప్పు అని నిర్ధారించే హక్కు మాత్రం మీడియాకు లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 

హైదరాబాద్ లో దిశ హత్యోదంతం అనంతరం నిందితులైన నలుగురు యువకులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌ను సవాల్ చేస్తూ మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.

న్యాయవాదులు జి.ఎస్.మణి, ఎం.ఎల్.శర్మ, ముకేష్ కుమార్ శర్మలు దాఖలు చేసిన ఈ పిటిషన్లను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా దిశ ఘటనానంతరం మీడియా ప్రసారాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన నోటీసులను న్యాయవాది ఎం.ఎల్.శర్మ కోర్టు ముందుంచారు. ఈ నోటీసులు పరిశీలించిన అనంతరం ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Loading...

More Telugu News