Telugudesam: సెంటిమెంట్ తో రాజధానిని మారుస్తారా?: వర్ల రామయ్య

  • క్రైస్తవుడైన జగన్ కు హిందూ స్వామీజీ జాతకం ఎలా చెప్పారో?
  • స్వామీజీల మాటలతో జగన్ ప్రజల్లో ఆందోళనలు రేపుతున్నారు
  • ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి స్టేజి మేనేజ్డ్ డ్రామా

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు జాతకాల పిచ్చి పట్టుకుందని టీడీపీ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. క్రైస్తవుడైన జగన్ కు హిందువైన ఆ స్వామీజీ జాతకాన్ని ఎలా చెప్పాడో.. ఆయన ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఆలింగనం చేసుకున్నపుడే ఆ స్వామీజీ గౌరవాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. రాజధాని ఈశాన్యంలో వుంటే మంచిదని.. ఎలాంటి కేసులు ఉండవంటూ స్వామీజీల మాటలతో జగన్ ప్రజల్లో ఆందోళనలు రేపుతున్నారని ఆరోపించారు. రైతులు నిర్వహించిన రహదారి దిగ్బంధంలో ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై జరిగిన దాడిని స్టేజి మేనేజ్డ్ డ్రామా అని వర్ల పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి, మరో ఎమ్మెల్యే వాహనాలను పక్కకు పంపించిన పోలీసులు పిన్నెల్లి వాహనాన్ని ఎందుకు ప్రజల మధ్యకు పంపించారని ప్రశ్నించారు.

Telugudesam
Varla Ramaiah
Jagan
Astrology sentiment
Amaravati
  • Loading...

More Telugu News