: పాక్ లో తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ నేత హత్య


పాకిస్తాన్ లో మరోసారి హత్యా రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు ముగిసి వారం రోజులయ్యాయో లేదో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ కు చెందిన నేత ఒకరు హత్యకు గురయ్యారు. కరాచీకి చెందిన జరా యూసుఫ్ తెహ్రీక్.. పార్టీకి నగరంలో ముఖ్యనేత. జరా.. శనివారం రాత్రి దుండగుల కాల్పుల్లో మరణించారు. ఈ ఘటన పట్ల ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఈ హత్యకు ముత్తాయిదా ఖ్వామి మూమెంట్ (ఎంక్యూఎం) పార్టీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రచార సభలో గాయపడిన ఇమ్రాన్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అక్కడి నుంచే మీడియాతో మాట్లాడిన ఈ మాజీ క్రికెటర్.. ప్రసార సాధనాల ద్వారా పలుమార్లు తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డ ఎంక్యూఎం అధినేత అల్తాఫ్ హుస్సేన్ ఈ హత్యకు బాధ్యుడని ఆరోపించారు. కాగా, జరా హత్య కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. ఈ వ్యవహారాన్ని రెండు కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు. ఇది రాజకీయ కోణంలో జరిగిన హత్యా? లేక, దోపిడీ దొంగల పనా? అనేది విచారణలో తేలుతుందని వారు అంటున్నారు.

  • Loading...

More Telugu News