Andhra Pradesh: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.. ప్రధాని 'మన్ కీ బాత్' కు ఫోన్ కాల్స్ వెల్లువ

  • ఏపీ రాజధాని మార్పుపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
  • అమరావతిలో తీవ్రస్థాయిలో ఉద్యమం
  • ప్రధాని మోదీకి తమ ఆవేదన తెలిపేందుకు రైతుల ప్రయత్నం

ఏపీ రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడు వారాలుగా అమరావతి రైతులు నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రధాని మోదీ నిర్వహించే 'మన్ కీ బాత్' కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫోన్లు చేశారు. రాజధాని అమరావతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని కోసం భూములను త్యాగం చేశామని, తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రధాని దృష్టికి వెళితే, కేంద్రం నుంచి ఏదైనా నిర్ణయం వెలువడుతుందని రైతులు భావిస్తున్నారు.

Andhra Pradesh
Amaravati
Narendra Modi
Mann Ki Baat
Phone Calls
Farmers
  • Loading...

More Telugu News