Amaravati: జేఏసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. ప్రవేశద్వారానికి తాళాలు

  • కాసేపటిలో భవనం వద్దకు రానున్న నేతలు 
  • ఈలోగా పోలీసుల కీలక నిర్ణయం
  • తనకు సంబంధం లేదంటున్న భవన యజమాని

రాజధాని పరిరక్షణ కోసం విజయవాడలో ఏర్పాటైన జేఏసీ కార్యాలయానికి తాళాలు పడ్డాయి. కాసేపటిలో జేఏసీ నేతలు కార్యాలయానికి రానున్న నేపధ్యంలో కార్యాలయానికి తాళాలు వేయడమేకాక భవనం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. పోలీసులే తాళాలు వేసి ఉంటారని నేతలు అనుమానిస్తున్నారు. ఈ విషయమై భవన యజమాని వద్ద ప్రస్తావించగా కొన్నాళ్ల క్రితమే తాను భవనాన్ని అద్దెకు ఇచ్చానని, ఆ తర్వాత ఏం జరుగుతోందో తనకు తెలియదని చెప్పారు. దీంతో కాసేపటిలో జేఏసీ నేతలు కార్యాలయానికి రానుండడంతో పోలీసులే వ్యూహాత్మకంగా కార్యాలయానికి తాళాలు వేసి ఉంటారని భావిస్తున్నారు.

Amaravati
JAC
Office
Police
  • Loading...

More Telugu News