Sankranti: ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రెట్టింపు చేసిన దక్షిణ మధ్య రైల్వే!

  • మొదలైన సంక్రాంతి సీజన్ రద్దీ
  • ప్లాట్ ఫామ్ టికెట్ ధర రూ. 20
  • రద్దీ తగ్గిన తరువాత తిరిగి సాధారణ స్థాయికి

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో సంక్రాంతి సీజన్ ముగిసేవరకూ ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను రెట్టింపు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా, తమ వారికి సెండాఫ్ ఇచ్చేందుకు వచ్చే వారి సంఖ్యను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి తదితర స్టేషన్లలో రూ. 10గా ఉన్న ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ. 20కి పెంచుతున్నట్టు తెలిపారు. సంక్రాంతి రద్దీ తగ్గిన అనంతరం తిరిగి టికెట్ ధరను సాధారణ స్థాయికి తీసుకువస్తామని వెల్లడించారు.

Sankranti
Railway Stations
SCR
Platform Ticket
Rate Hike
  • Loading...

More Telugu News