Vijayawada: ఎంత మందిని అరెస్టు చేస్తారు? రాష్ట్రం మొత్తాన్ని అరెస్టు చేస్తారా?: చంద్రబాబునాయుడు ఆగ్రహం

  • ‘మమ్మల్ని ఎందుకు ఆపారు? ఎందుకీ దౌర్జన్యం? 
  • ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు?
  •  ఏ చట్ట ప్రకారం బస్సు యాత్రను అడ్డుకుంటున్నారు?

విజయవాడలో తమ బస్సుయాత్రను ప్రారంభించకుండా పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న చంద్రబాబును పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘మమ్మల్ని ఎందుకు ఆపారు? ఎందుకీ దౌర్జన్యం? ఎంత మందిని అరెస్టు చేస్తారు? రాష్ట్రం మొత్తాన్ని అరెస్టు చేస్తారా? ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు? రాష్ట్రాన్ని తగలబెట్టాలని అనుకుంటున్నారా? ’ అంటూ మండిపడ్డారు.

బస్సుయాత్రకు పర్మిషన్ తీసుకున్నామని, చట్ట ప్రకారం వెళ్తున్నామని, అయినా, అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఏ చట్ట ప్రకారం తమ బస్సు యాత్రను అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఇది చాలా దుర్మార్గం అని, ఇది చట్ట వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని పోరాడతామని అన్నారు.

Vijayawada
Telugudesam
Chandrababu
Bus Yatra
  • Error fetching data: Network response was not ok

More Telugu News