Andhra Pradesh: ఉద్యోగులు అనేవాళ్లు ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి వెళ్లాలి: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

  • అమరావతిలో అన్నీ తాత్కాలికమేనన్న చంద్రశేఖర్ రెడ్డి
  • 95 శాతం ఉద్యోగులకు విశాఖ వెళ్లేందుకు ఇబ్బందిలేదని వెల్లడి
  • ఏ కమిటీ తమ అభిప్రాయాలు తీసుకోలేదన్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు

ఏపీలో మూడు రాజధానుల ఆలోచన మంచి నిర్ణయం అని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు అనే వాళ్లు ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి వెళ్లాలని అన్నారు. అమరావతిలో అన్నీ తాత్కాలికమే కాబట్టి ఉద్యోగులు వెళ్లడానికి ఇబ్బంది లేదని తెలిపారు. 95 శాతం ఉద్యోగులకు విశాఖకు వెళ్లడానికి ఇబ్బందిలేదని, కొందరు మాత్రమే అయిష్టత చూపుతున్నారని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఏ కమిటీ కూడా తమ అభిప్రాయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజధాని తరలింపు నేపథ్యంలో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఏపీఎన్జీవో అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Andhra Pradesh
Amaravati
Employees
Vizag
APNGO
Chandrasekhar reddy
  • Loading...

More Telugu News