YSRCP: ఫోన్లు చేయించి మరీ ఉసిగొల్పుతున్నాడు!: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

  • జిల్లాల నాయకులకు ఫోన్లు చేయిస్తున్నాడు
  • రాజధాని కోసం ఒక్క బస్సు తగలబెట్టలేక పోయారని అన్నాడు
  • ప్రభుత్వాఫీసులు ధ్వంసం చేయలేక పోయారంటున్నారు
  • పది రోజులుగా ఉసిగొల్పుతున్నాడట

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. నిన్న అమరావతి రాజధానిలో రైతులు చేసిన నిరసనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వీటిని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

'జిల్లాల నాయకులకు ఫోన్లు చేయించి రాజధాని కోసం ఒక్క బస్సు తగలబెట్టలేక పోయారు. ప్రభుత్వాఫీసులు ధ్వంసం చేయలేక పోయారని పది రోజులుగా ఉసిగొల్పుతున్నాడట. చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే ప్రభుత్వ విప్ పిన్నెల్లి గారిపై హత్యాయత్నం జరిగింది. విధ్వంసాలు సృష్టంచడం కొత్తేమే కాదు ఈ విజనరీకి' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News