Mothkupalli Narsimhulu: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మోత్కుపల్లి నర్సింహులు

  • కాషాయదళంలోకి కొనసాగుతున్న వలసలు
  • బీజేపీలో చేరిన మోత్కుపల్లి
  • సభ్యత్వ రశీదు అందజేసిన నడ్డా

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నడ్డా ఆయనకు బీజేపీ సభ్యత్వ రశీదు అందజేశారు. ఈ ఉదయం ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి బీజేపీ అగ్రనేత నడ్డాను కలిశారు. ఆయన వెంట తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు తదితరులున్నారు.

Mothkupalli Narsimhulu
Telangana
BJP
JP Nadda
Kishan Reddy
Lakshman
  • Loading...

More Telugu News