Panchumarthi Anuradha: అరెస్టులను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన పంచుమర్తి అనురాధ

  • అవనిగడ్డ, విజయవాడ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు
  • తోట్లవల్లూరు కరకట్టపై టీడీపీ కార్యకర్తల ధర్నా
  • రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత

ఏపీ రాజధాని మార్పుపై ఉద్యమిస్తున్న అమరావతి రైతుల పోరు తీవ్రరూపు దాల్చింది. రైతులకు మద్దతుగా ముందుకు వచ్చిన నారా లోకేశ్ తదితర టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ రోడ్డుపై బైఠాయించారు. లోకేశ్ ను విడుదల చేయాలంటూ తోట్లవల్లూరు కరకట్టపై టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. దాంతో అవనిగడ్డ, విజయవాడ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, లోకేశ్ ను ఏ కారణంతో అరెస్ట్ చేశారో పోలీసులు, ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. గద్దె రామ్మోహన్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన లోకేశ్ ను కారెక్కనివ్వకుండా అడ్డుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం దారుణమని అన్నారు. విజయవాడలో జరిగిన దీక్షకు వెళితే అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని మండిపడ్డారు.

Panchumarthi Anuradha
Telugudesam
Andhra Pradesh
Amaravati
Nara Lokesh
Police
  • Loading...

More Telugu News