Andhra Pradesh: రైతుల నిరసన.. రెండు కి.మీ.ల మేరకు ట్రాఫిక్.. మధ్యలో చిక్కుకుపోయిన మంత్రి ఆదిమూలపు సురేశ్
- చినకాకాని వద్ద హైవేను దిగ్బంధించిన రైతులు
- రోడ్లపై ఉన్న పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన
- వాహనాలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా బైఠాయించిన రైతులు
అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేస్తోన్న ఆందోళనల్లో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంటోంది. చినకాకాని వద్ద హైవేను రైతులు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై ఉన్న పోలీసుల బూట్లు తుడుస్తూ రైతులు నిరసన తెలుపుతున్నారు. రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
చినకాకానిలో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా బైఠాయించిన రైతులను పోలీసులు పక్కకు వెళ్లాలని చెప్పినా వారు వినట్లేదు.