suicide: తల వెంట్రుకలు రాలిపోతున్నాయన్న మనస్తాపంతో.. యువకుడి ఆత్మహత్య

  • జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి
  • ఆరు నెలలుగా రాలిపోతున్న వెంట్రుకలు
  • సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

తల వెంట్రుకలు ఊడిపోయి చిన్న వయసులోనే బట్టతల వస్తుండడంతో మనస్తాపానికి గురైన 18 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన బాధిత కుర్రాడు ఇంటర్ పూర్తిచేసి జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. గత కొంతకాలంగా తల వెంట్రుకలు రాలిపోయి క్రమంగా బట్టతల రావడంతో మనస్తాపానికి గురయ్యాడు. తల వెంట్రుకలు ఊడిపోతున్న విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి ఆవేదన వ్యక్తం చేశాడు.

సోమవారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లిన కుమారుడు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి తలుపుకొట్టింది. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వెంటనే భర్తకు సమాచారం అందించింది. ఆయన వచ్చి తలుపు పగలగొట్టి చూడగా కుమారుడు ఉరి వేసుకుని వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఆయనిచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బట్టతల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

suicide
Hyderabad
hair loss
bald head
  • Loading...

More Telugu News