Andhra Pradesh: నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే కుటుంబాలకు 'అమ్మఒడి' వర్తించదు: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్

  • ఈ నెల 9 నుంచి అమ్మఒడి అమలు
  • చిత్తూరులో ప్రారంభించనున్న సీఎం జగన్
  • వివరాలు వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేశ్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో అమ్మఒడి ఒకటి. పిల్లలను చదివించే తల్లి ఖాతాలో ఏటా రూ.15 వేలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని ఈ నెల 9న చిత్తూరులో సీఎం జగన్ ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. పిల్లల్ని బడికి పంపే తల్లికి అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు అందిస్తామని తెలిపారు. 43 లక్షల మంది తల్లుల ఖాతాలో రూ.6,400 కోట్లు జమచేస్తామని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

అయితే, నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే కుటుంబాలకు అమ్మఒడి వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఆరు నెలల విద్యుత్ బిల్లుల సరాసరి పరిశీలించి అర్హులను గుర్తిస్తామని తెలిపారు. ఈసారి 75 శాతం హాజరు నిబంధన పరిగణించకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

Andhra Pradesh
YSRCP
Jagan
Amma Odi
Adimulapu Suresh
Chittoor District
  • Loading...

More Telugu News