: సెప్టెంబర్ లో అమెరికా వెళ్ళనున్న మన్మోహన్


ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్ళే క్రమంలో భారత ప్రధాని మన్మోహన్ అమెరికాలో పర్యటించనున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలే మన్మోహన్ కు ఆహ్వానం పంపారని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ విన్నపానికి భారత ప్రధాని స్పందించారు. ఆయన సెప్టెంబర్ లో అమెరికా వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో పాల్గొంటారు. కాగా, మన్మోహన్ తన అమెరికా పర్యటనలో పెట్టుబడులు, ఇరు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు, ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News