Ala Vaikunthapuramulo: 'అల.. వైకుంఠపురములో' మ్యూజికల్ ఈవెంట్ కు సర్వం సిద్ధం

  • నేడు హైదరాబాదులో బన్నీ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్
  • యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వేడుక
  • తరలి వచ్చిన బన్నీ ఫ్యాన్స్

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'అల... వైకుంఠపురములో' చిత్రం మ్యూజికల్ ఈవెంట్ జరుపుకుంటోంది. ఈ సంగీతభరిత సంబరానికి హైదరాబాదులోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే భారీ సంఖ్యలో బన్నీ అభిమానులు చేరుకోవడంతో పోలీస్ గ్రౌండ్స్ క్రిక్కిరిసిపోయింది. సౌతిండియాలో ఇప్పటివరకు ఏ సినీ ఈవెంట్ కు వేయనంత భారీగా స్టేజ్ వేసినట్టు సమాచారం.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తమన్, శివమణి, సిద్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, లేడీ కాశ్, రాహుల్ నంబియార్, ప్రియా సిస్టర్స్ వంటి సంగీత కళాకారులు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. అంతేకాదు, ఎంజే ఫైవ్ డ్యాన్స్ షో, ఇండియన్ రాగా ప్రత్యేక ప్రదర్శన వుంటాయి. దాదాపు అన్ని ప్రధాన వార్తా చానళ్లలో అల... వైకుంఠపురములో ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ ఇవ్వనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ అవుతోంది.

Ala Vaikunthapuramulo
Allu Arjun
Trivikram
Puja Hegde
Tollywood
Musical Event
  • Loading...

More Telugu News