Anand Mahendra: దాడులకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలి: జేఎన్ యూ ఘటనపై ఆనంద్ మహీంద్రా

  • రాజకీయాలు, విశ్వాసాలకతీతంగా అందరం ముందుకు సాగాలి
  • సాయుధ గూండాలు, చట్టాలు పట్టించుకోనివారిని ఉపేక్షించొద్దు
  • విద్యా నిలయంలో హింస చోటుచేసుకోవడం బాధాకరం

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్ యూ)లో విద్యార్థులు, అధ్యాపకులపై నిన్న రాత్రి దుండగులు జరిపిన దాడిపై సర్వత్రా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. విద్యా నిలయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. పార్టీలు తమ రాజకీయ సిద్ధాంతాలను పక్కనబెట్టి హింసకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పారు.

‘మీ రాజకీయ సిద్ధాంతాలు వేరు కావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీ రాజకీయ విభేదాలు పక్కన పెట్టాలి. వ్యక్తుల విశ్వాసాలు కూడా వేరు కావొచ్చు. వాటికి అతీతంగా స్పందించాలి. అన్నింటికంటే ముందు మీరు భారతీయులు. ఆయుధాలు ధరించి వచ్చిన గుండాలను, చట్టాలు పట్టించుకోనివారిని సహించకూడదు. జేఎన్ యూలో దాడులకు దిగిన వారిని గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలి’ అని ట్విట్టర్ మాధ్యమంగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News