Telugudesam: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతులు, మహిళల భారీ ర్యాలీ

  • వెలగపూడి నుంచి మందడం వరకు కొనసాగిన ర్యాలీ
  • జాతీయ జెండాతో 10 కిలోమీటర్ల మేర నిర్వహణ
  • ర్యాలీలో పాల్గొన్న టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వెలగపూడిలో రిలే నిరహారదీక్ష చేపట్టిన వారికి మద్దతుగా రైతులు,మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాతో 10కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీని కొనసాగించారు. తుళ్లూరు నుంచి మందడం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. యువత ద్విచక్రవాహనాలపై  ర్యాలీలో కొనసాగుతుండగా, వృద్ధులు ట్రాక్టర్లపై నిరసన తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు రాజధాని రైతులు, మహిళల పాదయాత్ర వెలగపూడికి చేరుకుంది. పోలీసులు వీరి యాత్రను అడ్డుకున్నప్పటికీ రైతులు, మహిళలు యాత్రను కొనసాగించారని తెలుస్తోంది.

ఈ ర్యాలీకి  పలు పార్టీలు మద్దతు పలికాయి. టీడీపీ సహా బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతలు దీక్ష చేపట్టిన వారికి మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఇదిలావుండగా, ఈ రోజు విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ 24 గంటల నిరాహార దీక్షకు దిగడంతో ఆయనకు సంఘీభావం తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా కూడా మద్దతుగా దీక్షకు దిగారు.

Telugudesam
Amaravati
capital
Rally
Tulluru to Mandam
Farmers
Women
Issue
Agitation
  • Loading...

More Telugu News