Chandrababu: తన బంగారు గాజులు తీసి.. చంద్రబాబుకు విరాళంగా ఇచ్చిన మహిళ
- అమరావతి రాజధాని పరిరక్షణ సమితికి విరాళం
- చంద్రబాబుకు విరాళాలు అందించిన మరికొందరు రైతులు
- ప్రశంసించిన చంద్రబాబు
అమరావతి రాజధాని పరిరక్షణ సమితికి పలువురు విరాళాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ 24 గంటల నిరాహార దీక్షకు దిగడంతో ఆయనకు సంఘీభావం తెలపడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన బంగారు గాజులను తీసి ఆయనకు విరాళంగా అందించింది.
అనంతరం పలువురు నేతలు, రైతులు అమరావతి రాజధాని పరిరక్షణ సమితి కోసం చంద్రబాబుకు తమకు తోచిన విధంగా నగదును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు ప్రశంసించారు. రైతులు ఎన్నో త్యాగాలు చేసి భూములు ఇస్తే, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు రాజధానిని తరలిస్తాననడం సరికాదని ఆయన విమర్శలు గుప్పించారు.