: తమిళ ఈలానికి కాశ్మీరీ వేర్పాటువాది మద్దతు
కాశ్మీరీ వేర్పాటువాది యాసిన్ మాలిక్ శ్రీలంకలో ప్రత్యేక దేశం కోసం చేస్తున్న తమిళ ఈలం పోరాటానికి మద్దతు పలికారు. లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం(ఎల్ టీటీఈ) వ్యవస్థాపకుడు, శ్రీలంక సైన్యం చేతిలో హత్యకు గురైన వేలుపిళ్లై ప్రభాకరన్ వర్థంతి శనివారం జరిగింది. ఈ సందర్భంగా తమిళనాడులో నామ్ తమిళర్ నిర్వహించిన కార్యక్రమానికి యాసిన్ మాలిక్ హాజరయ్యారు. ఈయనను తమిళనాడుకు ఆహ్వానించడం ఇదే ప్రథమం. ఈ అవకాశాన్ని యాసిన్ బాగానే వినియోగించుకున్నారు. శ్రీలంక ప్రభుత్వం ఎల్టీటీఈని తుడిచిపెట్టిందేమో కానీ, ప్రతీ తమిళియన్ కు తమిళ ఈలం ఒక లక్ష్యమని యాసిన్ పేర్కొన్నారు. శ్రీలంకలో జాతి విధ్వంసం జరగకుండా చూడడంలో భారత్ విఫలమైందని విమర్శించారు.