Amaravati: అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుగుతుంది: మంత్రి బొత్స

  • తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేస్తుంది
  • ఒక్క రాజధానినే నిర్మించలేకపోతున్నామా?
  • ఇలా విమర్శలు చేసేవాళ్లు ఏమైనా మహాపురుషులా?

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుగుతుందని, తప్పు చేసిన వారి విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఒక్క రాజధాని కట్టడమే చేతగానీ వాళ్లు మూడు రాజధానులు ఎలా కడతారంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం వల్ల ఉపయోగం ఉందో లేదో పర్యవేక్షిస్తున్నామే తప్ప చేతగాని తనం కాదని వివరించారు. ఇలా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్లేమైనా మహాపురుషులా? పుట్టడం పుట్టడమే టెక్నాలజీతో పుట్టారా? అని ప్రశ్నించారు.  

Amaravati
Minister
Botsa Satyanarayana Satyanarayana
Vizag
  • Loading...

More Telugu News