kcr: కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నా: కొప్పుల ఈశ్వర్

  • ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడే 
  • యువనాయకుడు సీఎం అయితే సంతోషమే
  • కేటీఆర్ సీఎం ఎప్పుడు అయ్యేది కేసీఆర్ నిర్ణయిస్తారు

కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నానని, ముఖ్యమంత్రి పదవికి ఆయన సమర్థుడేనని టీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అనుకున్నది ఐదేళ్లలో సాధించారని, తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని ప్రశంసించారు. యువనాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంతోషమేనని అన్న కొప్పుల, కేటీఆర్ సీఎం ఎప్పుడు అయ్యేది కేసీఆర్ నిర్ణయిస్తారని అన్నారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనేది తమ పార్టీ ఇష్టం అని, ఈ విషయమై టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు.

kcr
ktr
Telangana
minister
Koppula Eshwar
  • Loading...

More Telugu News