Kanna Lakshminarayana: రాజధాని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు: కన్నా లక్ష్మీ నారాయణ

  • గతంలో పార్టీలన్నీ కలిసి అమరావతికి మద్దతిచ్చాయి
  • అమరావతి అభివృద్దికి కేంద్రప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది
  • రాష్ట్ర ప్రభుత్వ చేసే పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పార్టీలన్నీ కలిసి అమరావతికి మద్దతిచ్చాయని చెప్పారు. అమరావతి అభివృద్దికి కేంద్రప్రభుత్వం కూడా నిధులు ఇచ్చిందని, రాజధానిపై ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చేసే పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదని, అయితే, ఏదైనా అడిగితే మాత్రం కేంద్రం సూచనలు, సలహాలు ఇస్తుందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.  రాజధాని అంశంపై తాము స్పష్టంగా ఉన్నామని చెప్పారు.  స్టేక్ హోల్డర్స్ ఆమోదం లేకుండా రాజధాని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.

Kanna Lakshminarayana
YSRCP
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News