Mahesh Babu: మచిలీపట్నంలో ఫ్యాన్స్ ను నిరాశపరిచిన మహేశ్ బాబు!

  • మచిలీపట్నంలో కార్యక్రమం
  • సాయంత్రానికే చేరుకున్న మహేశ్
  • వర్షం పడటంతో కార్యక్రమం ఆలస్యం
  • అభిమానులను పలకరించకుండానే వెనుదిరిగిన మహేశ్

తమ స్టార్ హీరో మహేశ్ బాబును చూడాలని ఎంతో ఆశగా వచ్చిన అభిమానులు నిరాశచెందారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సిన టాలీవుడ్ ప్రిన్స్, సాయంత్రం 4.30 గంటలకే నగరానికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందన్న అంశంపై స్పష్టత రాలేదు.

వర్షం తగ్గినా, రాత్రి 10 గంటల వరకూ ప్రోగ్రామ్ మొదలయ్యే పరిస్థితి లేదని నిర్వాహకులు స్పష్టం చేసిన నేపథ్యంలో, మహేశ్ బాబు వెళ్లిపోయారు. నేడు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఉండటం, మచిలీపట్నం నుంచి బయలుదేరితే, రాత్రంతా ప్రయాణం చేయాల్సి వుండటంతో మహేశ్ బాబు వెళ్లిపోయారు. దీంతో ఆయన్ను చూద్దామని వర్షంలోనూ వేచివున్న ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది.

Mahesh Babu
Fans
Machilipatnam
  • Loading...

More Telugu News