Rain: తెలుగు రాష్ట్రాల్లో మరింతగా పెరగనున్న చలి... హెచ్చరించిన వాతావరణ శాఖ!

  • తొలగిపోయిన అల్పపీడన ద్రోణి
  • మరింతగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
  • ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వర్షం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింతగా పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నమొన్నటి వరకూ ఉన్న అల్పపీడన ద్రోణి తొలగిపోయిందని, ఈ కారణంతో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గనున్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలనూ పొగమంచు కమ్మేస్తోందని, వాహనదారులు, ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాలు సాగించే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

కాగా, గత రాత్రి ఆదిలాబాద్ లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షం కురవగా, ఆముదం పంట దెబ్బతింది. చలి తీవ్రతకు పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.

Rain
IMD
Telangana
Andhra Pradesh
Cold
Winter
  • Loading...

More Telugu News