Amma odi: ‘అమ్మ ఒడి’ పథకానికి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

  • విడుదల కానున్న మొత్తం నిధులు రూ.6,109 కోట్లు
  • ఒకటినుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు వర్తింపు
  • ఏడాదికి విద్యార్థి తల్లికి రూ.15వేల సాయం అందజేత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు చేయూత నిచ్చేందుకు ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక పథకం ‘అమ్మ ఒడి’ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వివిధ శాఖల నుంచి ఈ పథకానికి రూ.6,109 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది.  ఈ పథకం కింద ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకాన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలతో నిమిత్తం లేకుండా 75 శాతం హాజరు కలిగిన ప్రతి విద్యార్థికి వర్తింపచేయనున్నారు.

ఆయా శాఖల నుంచి విడుదల కానున్న నిధుల వివరాలు

బీసీ కార్పొరేషన్ నుంచి రూ.3,432 కోట్లు
కాపు కార్పొరేషన్ నుంచి రూ.568 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి రూ.442 కోట్లు
గిరిజన ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.395 కోట్లు
ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.1,271 కోట్లు

Amma odi
Andhra Pradesh
Funds
Release
permission
from ministries
  • Loading...

More Telugu News