sucheta satish: ఒకే పాట.. 120 భాషల్లో గానం చేసి ఔరా అనిపించిన సుచేత
- ‘2020 గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ’ అవార్డు సొంతం
- 6.15 గంటల్లో పాడి విజేతగా నిలిచిన బాలిక
- ‘యూ హబీబీ’ అల్బమ్ లో గానంతో ఆకట్టుకున్న సుచేత
దుబాయ్ లో ఉంటున్న 13 ఏళ్ల ప్రవాస భారతీయ బాలిక సుచేత సతీష్ సంగీత కచేరీలో అద్భుత ప్రతిభను చాటి ప్రతిభగల చిన్నారులకిచ్చే ‘2020 గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ’ అవార్డును అందుకుంది. సుచేత 120 భాషల్లో ఒకే పాటను గానం చేసి ఈ అవార్డును గెలుచుకుంది. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె అవార్డును స్వీకరించింది. ప్రపంచ వ్యాప్తంగా నృత్యం సంగీతం, నటన, మోడలింగ్, క్రీడలు.. తదితర అంశాల్లో విశేష ప్రతిభ చాటిన 100 మంది చిన్నారులకు ఈ అవార్డులను అందజేశారు.
సుచేత తన పేరెంట్స్ తో కలిసి దుబాయ్ లో ఉంటోంది. ఈ సందర్భంగా సుచేత మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండేళ్ల క్రితం దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ లో నిర్వహించిన సంగీత కచేరీలో ఒకే పాటను 102 భాషల్లో పాడాను. ఇటీవల దుబాయిలో ‘మమంగం’ సినిమా చిత్రీకరణలో భాగంగా ఇక్కడికి వచ్చిన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, నటుడు ఉన్ని ముకుందన్ లను కలిశాను. వారు నాకు శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి నేతృత్వంలో నేను పాడిన పాట ‘యూ హబీబీ’ పేరుతో రెండో అల్బమ్ ను విడుదల చేశాను. కార్యక్రమంలో పాల్గొన్న నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యర్థిని కలవడం సంతోషాన్నిచ్చింది’ అని సుచేత తెలిపింది.