Ali: సొంత బ్యానర్ స్థాపించిన కమెడియన్ అలీ... పేరు 'అలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్స్'!

  • తన పేరు కలిసొచ్చేలా బ్యానర్
  • వెబ్ సిరీస్ లు, సీరియళ్ల నిర్మాణం
  • తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కార్యకలాపాలు

టాలీవుడ్ లో ఇప్పటికీ వన్నె తగ్గని కమెడియన్ గా ప్రస్థానం కొనసాగిస్తున్న అలీ తాజాగా నిర్మాణ రంగంలో ప్రవేశించారు. నూతన సంవత్సరం సందర్భంగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఇతర బ్యానర్లకు భిన్నంగా తన నిర్మాణ సంస్థ పేరును 'అలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్స్' గా ప్రకటించారు. తన పేరు కలిసొచ్చేలా నామకరణం చేశారు.

ఈ బ్యానర్ ద్వారా వెబ్ సిరీస్ లు, వాణిజ్య ప్రకటనలు, టీవీ సీరియళ్లు, ఎంటర్టయిన్ మెంట్ షోలు నిర్మించాలన్నది అలీ ఆలోచన. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ కార్యకలాపాలు ఉంటాయట! హైదరాబాదు శివార్లలోని మణికొండలో ఉన్న తన నివాసానికి దగ్గర్లోనే 'అలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్స్' ఆఫీసును ఏర్పాటు చేసినట్టు అలీ తెలిపారు.

Ali
Tollywood
Aliwood Entertainments
Production
Web Series
Ads
TV Show
  • Loading...

More Telugu News