Ala Vaikunthapuramulo: శ్రేయాఘోషల్ గొంతులో 'సామజ వర గమన'... ఎలావుందో వినండి!

  • శ్రోతలను అలరించిన సామజ వర గమన  
  • సిద్ శ్రీరామ్ గానం  
  • తాజాగా ఫిమేల్ వెర్షన్ రిలీజ్

ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాల్లో అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' ఒకటి. ఈ చిత్రంలోని 'సామజ వర గమన' అనే సాంగ్ ఎంత పాప్యులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యాచీ ట్యూన్ కావడంతో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అయితే, ఇప్పటివరకు ఈ పాటను మేల్ వెర్షన్ లోనే విన్నారు. దీన్ని సిద్ శ్రీరామ్ పాడిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా 'సామజ వర గమన' ఫిమేల్ వెర్షన్ వచ్చింది. ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ ఆలపించిన 'సామజ వర గమన' కవర్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు.

Ala Vaikunthapuramulo
Allu Arjun
Trivikram Srinivas
Tollywood
Samajavaragamana
Shreya Ghoshal
  • Error fetching data: Network response was not ok

More Telugu News