Rasi Khanna: అంచనాలు పెంచేసిన రాశి ఖన్నా

  • అందమైన కథానాయికగా పేరు 
  • నిదానంగా సాగుతున్న కెరియర్ 
  • గ్లామర్ డోస్ పెంచేసిన రాశి ఖన్నా  

అందమైన కథానాయికగా రాశి ఖన్నాకి యూత్ లో మంచి క్రేజ్ వుంది. నిదానమే ప్రధానమన్నట్టుగా ఆమె ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతోంది. కెరియర్ పరంగా స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకోవాలనే తొందర రాశి ఖన్నాలో కనిపించదు. అందుకోసం ఆమె గ్లామర్ ఒలకబోసిన దాఖలాలు కూడా కనిపించవు.

అలాంటి రాశి ఖన్నా 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో గ్లామర్ ఒలకబోసినట్టు .. కొన్ని బోల్డ్ సీన్స్ లోను నటించినట్టు వార్తలు వచ్చాయి. నిన్న విడుదలైన టీజర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాశి ఖన్నా బోల్డ్ సీన్స్  చేసిందనే విషయం స్పష్టమైన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రాశి ఖన్నా చేసిన ఈ సాహసం ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. నలుగురు హీరోయిన్స్ తో విజయ్ దేవరకొండ చేసే ఈ రొమాంటిక్ మూవీని ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు.

Rasi Khanna
Vijay Devarakonda
  • Loading...

More Telugu News