Amaravati: రైతుల నుంచి లాక్కున్న భూములను టీడీపీ నేతలు తిరిగి ఇచ్చేయాలి: మంత్రి శంకర్ నారాయణ డిమాండ్

  • నాడు చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు
  • శ్రీకృష్ణ,శివరామకృష్ణ కమిటీల నివేదికలను బాబు ఎందుకు పట్టించుకోలేదు?
  • అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం

రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి టీడీపీ నేతలు లాక్కున్న భూములను తిరిగి వారికి ఇచ్చివేయాలని ఏపీ మంత్రి శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీకృష్ణ కమిటీ,శివరామకృష్ణ కమిటీల నివేదికలను చంద్రబాబు ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని, నారాయణ కమిటీ సూచనల మేరకు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని అన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం అని ఈ సందర్భంగా శంకర్ నారాయణ స్పష్టం చేశారు.

Amaravati
Chandrababu
YSRCP
Shankar narayana
  • Loading...

More Telugu News