BJP: సీఏఏకి అనుకూలంగా బీజేపీ ర్యా లీ

  • కడపలో ర్యాలీని ప్రారంభించిన కేంద్రమంత్రి 
  • మున్సిపల్ మైదానం నుంచి అంబేద్కర్ కూడలి వరకు 
  • ప్రజల్లో చట్టంపై అవగాహన కోసమే అన్న పార్టీ వర్గాలు

కడపలో బీజేపీ శ్రేణులు సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించాయి. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ర్యాలీని ప్రారంభించారు. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో సిటిజన్ ఎమండమెంట్ ఏక్ట్ (సీఏఏ) పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే ఈ ర్యాలీ నిర్వహించినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.

మున్సిపల్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, సినీ నటి కవిత, నెహ్రూ యువ కేంద్ర జాతీయ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఇతర బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలతో పాటు భారీగా విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

BJP
cuddupha
rally
CAA
  • Loading...

More Telugu News