Andhra Pradesh: రాజధాని మహిళలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: మానవ హక్కుల కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు

  • అమరావతిలో రైతుల ధర్నా హింసాత్మకం
  • మహిళలపై పోలీసుల లాఠీచార్జి
  • పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న కనకమేడల

ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ నిరసనలు హింసాత్మక రూపుదాల్చాయి. మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కాగా, దీనిపై టీడీపీ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మహిళలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ మానవ హక్కుల కమిషన్ ను కోరారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై దౌర్జన్యం చేశారని, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదని అన్నారు. పోలీసులు నోటికొచ్చినట్టు దూషించడమే కాకుండా, వారిపై దాడులకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు.

Andhra Pradesh
Amaravati
Police
Farmers
Women
Telugudesam
NHRC
  • Loading...

More Telugu News