Whatsapp: కొత్త సంవత్సరానికి ఒక్కరోజు ముందు వాట్సాప్ లో సందేశాల సునామీ

  • ఒక్క రోజులో 100 బిలియన్ల సందేశాలు
  • భారత్ నుంచి 20 బిలియన్లు
  • వాటిలో 12 బిలియన్లు ఫొటోలే!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సందేశాలు పంపుకోవడం మరింత సులభతరం అయింది. ప్రత్యేకించి ఏదైనా పండుగలు, విశిష్టమైన పర్వదినాల్లో సామాజిక మాధ్యమాలు శుభాకాంక్షలతో పొంగిపొర్లుతుంటాయి. తాజాగా, న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో సందేశాల సునామీ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

నూతన సంవత్సరాది ముందు రోజున వాట్సాప్ లో 100 బిలియన్ల సందేశాలు పోస్టు అయినట్టు గుర్తించారు. వాటిలో 12 బిలియన్లు ఫొటోలే ఉన్నాయి. వాట్సాప్ రంగప్రవేశం చేసిన తర్వాత ఇన్నేళ్లలో ఒక్కరోజే ఇన్ని సందేశాలు రావడం ఇదే ప్రథమం అని యాజమాన్యం పేర్కొంది. కాగా, ఆ వంద బిలియన్ల సందేశాల్లో ఒక్క భారత్ నుంచే 20 బిలియన్ సందేశాలు పోస్ట్ అయ్యాయట!

Whatsapp
Message
New Year 2020
New Year
2020
India
Photo
  • Loading...

More Telugu News