cm: అనధికార లేఔట్ లో సీఎం జగన్ తన ఇంటిని నిర్మించుకున్నారు: టీడీపీ నేత ధూళిపాళ్ల ఆరోపణ

  • తాడేపల్లిలో ఇల్లు కట్టిన లేఔట్ కు అనుమతి ఉందా?
  • సీఎం జగన్ ఇంటిని కూల్చుతారా?
  • ఆ ఇంటి కోసం భూములు సేకరించిన వాళ్లూ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసినట్లేగా?

ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టిన లేఔట్ కు అసలు అనుమతి ఉందా? అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి, చట్టాన్ని గౌరవించాలి కదా, ఆయన ఉన్న ఇంటి లే అవుట్ కు అసలు అప్రూవల్ ఉందా? అనధికారిక లే అవుట్ లో ఉంటున్నాడని ఆరోపించారు. మరి, అనుమతి లేని కట్టడంలో ఉన్న సీఎం ఇంటిని కూల్చుతారా? అని ప్రశ్నించారు.

జగన్ ఇంటి కోసం భూములు సేకరించిన వాళ్లు కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసినట్లే కదా? రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన ప్రతిఒక్కరూ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తే ఎలా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అనే బూచిని చూపించే ప్రయత్నం చేస్తూ తమ పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తున్న జగన్ కు సంబంధించిన వ్యక్తులు 2016లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? వాళ్లందరూ జగన్ కు బినామీలు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News