Voter list: మూడేళ్లకే ఓటు హక్కు.. కరీంనగర్ ఓటర్ జాబితాలో విచిత్రం

  • ఓటరు కార్డు కూడా జారీ
  • మూడేళ్ల పాప వయసు 35 ఏళ్లుగా ప్రింట్
  • తప్పుల తడకగా ఓటర్ల జాబితా

ఓటరు జాబితాలో మూడేళ్ల పాపకు చోటు కల్పించిన విచిత్రం కరీంనగర్ లో చోటుచేసుకుంది. పట్టణంలోని మారుతినగర్ కు చెందిన మూడు సంవత్సరాల వయసున్న మెతుకు శ్రీనందిత పేరిట ఫొటోతో కూడిన ఓటరు కార్డు (YOJ8588352) జారీ అయిందని తెలుస్తోంది. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడదల కావడంతో.. అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జాబితాలో ఎన్నో తప్పులున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే చిన్నారి నందిత వయసును ఓటరు కార్డులో 35గా పేర్కొన్నారు. అధికారులు ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో ఓటరు కార్డు జారీ అయినట్లు సమాచారం.

Voter list
3Years old
Girl
listed
Karimnagar District
Telangana
  • Loading...

More Telugu News